ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

'రాష్ట్రానికి వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిపై చర్చకు కొడాలి నాని సిద్ధమా': కొలికపూడి - Kolikapudi fires on kodali nani

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 21, 2024, 3:41 PM IST

Kolikapudi Srinivas Fires On Kodali Nani: ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజల సమస్య కోసం గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఎప్పుడు స్పందించలేదని ఏపీ పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. నాని అంటే నమ్మించి నిండా ముంచడమని ఎద్దేవా చేశారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమాని దగ్గర కొడాలి నాని కోటి రూపాయలు తీసుకుని మోసం చేశాడని ఆయన ఆరోపించారు. గుడివాడలో నాని వల్ల కాపు నేత ఆత్మహత్య చేసుకున్నాడని విమర్శించారు. తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి చంద్రబాబు, లోకేశ్‌పై విమర్శలు చేస్తాడని కొలికపూడి మండిపడ్డారు. రాష్ట్రానికి వైఎస్సార్సీపీ చేసిన అభివృద్ధిపై (YSRCP Development) చర్చకు కొడాలి నాని సిద్ధమా అని సవాల్ (challenge) చేశారు.

జగన్​ను తృప్తి పరచడానికి కొడాలి నాని విమర్శలకు దిగుతున్నారని కొలికపూడి మండిపడ్డారు. నమ్మించి మెసం చేయటమే నాని పని అని కొలికిపూడి విమర్శించారు. గుడివాడలో కాపులు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో వ్యాపారస్తులు, జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని బాధితులని కొలికపూడి దుయ్యబట్టారు.

ABOUT THE AUTHOR

...view details