తెలంగాణ

telangana

ETV Bharat / videos

LIVE : మెహబూబ్ కాలేజీలో బీజేపీ విజయసంకల్ప బహిరంగ సభ - ప్రత్యక్షప్రసారం - Kishan Reddy nomination live - KISHAN REDDY NOMINATION LIVE

By ETV Bharat Telangana Team

Published : Apr 19, 2024, 10:42 AM IST

Updated : Apr 19, 2024, 12:24 PM IST

Kishan Reddy Live : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సికింద్రాబాద్ బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఈ సందర్బంగా తొలుత సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో కిషన్‌రెడ్డి ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం ఆలయం నుంచి ప్రజలు, అభిమానుల కోలాహలం మధ్య ర్యాలీగా మెహబూబ్ కాలేజీకి చేరుకున్నారు. అక్కడ కళాశాలలోని వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.అనంతరం మెహబూబ్ కాలేజీ మైదానంలో నిర్వహించే సభలో కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సభకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ముఖ్య అతిధులుగా హాజరుకానున్నారు. పదేళ్లలో నరేంద్ర మోదీ చేసిన అభివృద్ధి, తెలంగాణకు కేటాయించిన నిధులపై సభా వేదికగా రాజ్‌నాథ్ సింగ్ ప్రజలకు వివరించనున్నారు. సభా అనంతరం 11.45 గంటలకు జీహెచ్‌ఎంసి సికింద్రాబాద్ జోనల్ కార్యాలయంలో కిషన్‌రెడ్డి నామినేషన్ వేయనున్నారు.
Last Updated : Apr 19, 2024, 12:24 PM IST

ABOUT THE AUTHOR

...view details