తెలంగాణ

telangana

ETV Bharat / videos

నరేంద్ర మోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారు : కిషన్ రెడ్డి - Kishan Reddy Comments On Modi Govt - KISHAN REDDY COMMENTS ON MODI GOVT

By ETV Bharat Telangana Team

Published : Mar 21, 2024, 5:23 PM IST

Kishan Reddy Comments On Modi Government : నరేంద్రమోదీ నాయకత్వాన్ని దేశ ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో నరేంద్రమోదీ నాయకత్వంలో ఎన్​డీఏ కూటమి 400 సీట్లు గెలిచే దిశగా కృషి చేస్తుందన్నారు. బాగ్ అంబర్​పేట్ డివిజన్​లో నందనవనం, శారద నగర్, సంజయ్ గాంధీనగర్, సాయిబాబా నగర్, ఈసీ కాలనీలలో బస్తీ పర్యటన నిర్వహించారు.

 ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజలు నరేంద్ర మోదీ నాయకత్వాన్ని మళ్లీ కోరుకుంటున్నారన్నారు. బీజేపీ 302 సీట్లు ఉన్నాయి, ఇప్పుడు 370 సీట్లతో మళ్లీ బీజేపీ స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పడం కోసం, ఒక సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం, ఒక నీతి నిజాయితీతో కూడిన అవినీతి లేని ప్రభుత్వం కోసం మళ్లీ నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రజలు కోరుకుంటున్నారు అని తెలిపారు. పేద ప్రజల సంక్షేమం కోసం దేశంలో మౌలిక వసతులు కల్పించడం కోసం కానీ అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపిన నరేంద్ర మోదీని, బీజేపీని గెలిపించాలని కిషన్​రెడ్డి కోరారు. 

ABOUT THE AUTHOR

...view details