ఈ బెజవాడ నీళ్లను సీఎం జగన్, భారతి రెడ్డి తాగుతారా?: కేశినేని శ్రీదేవి ఫైర్ - water issue in Bejawada - WATER ISSUE IN BEJAWADA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 22, 2024, 5:25 PM IST
Kesineni Sridevi anger over water issue: బెజవాడోళ్లకిచ్చే నీరు జగన్, భారతి తాగుతారా అని కేశినేని శ్రీదేవి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 41వ డివిజన్ లో ఓ ఇంట్లోకి కార్పొరేషన్ సరఫరా చేసిన తాగునీరుపై ఆమె తీవ్రంగా స్పందించారు. ఐదేళ్లుగా ఇటువంటి కలుషిత నీరే సరఫరా అవుతోందని మండిపడ్డారు. తన సోదరుడు కేశినేని శివనాథ్ (చిన్ని) ఎంపీగా పోటీచేస్తుండడంతో సైకిల్ గుర్తుపై ఓటువేసి గెలిపించాలని కేశినేని శ్రీదేవి విస్తృత ప్రచారం చేస్తున్నారు. 41వడివిజన్‌లో ఓ ఇంటికి వెళ్లగా, ఆ మహిళ తమకు కార్పొరేషన్ ఇస్తున్న తాగునీరు చూపించి ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో నీటి సరఫరా ఇంత అధ్వాన్నంగా లేదని తెలిపారు. వైసీపీ ప్రభుత్వంలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, కలుషిత నీరు తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని దుయ్యబట్టారు. మళ్లీ వైసీపీ ప్రభుత్వానికి ఓటు వేస్తే ఇంతకన్నా దారుణంగా తయారవుతుందని పేర్కొన్నారు. రాబోయే తెలుగుదేశం ప్రభుత్వంలో నాన్యమైన మంచి నీటి సరఫరా కోసం కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.