ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రాభివృద్ధి చెందాలంటే చంద్రబాబు రావాలి: కాపు సంఘాల నేతలు - Kapu JAC Support Alliance - KAPU JAC SUPPORT ALLIANCE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 16, 2024, 7:44 PM IST

Kapu JAC Support Alliance in 2024 Elections: జాతి, రాష్ట్ర ప్రయోజనాల కోసం సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ (NDA) అభ్యర్థులకు మద్దతుగా నిలబడతామని విశాఖలో కాపు సంఘాల జేఏసీ నాయకులు ప్రకటించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కాపులకు ఎలాంటి న్యాయం చేయలేదని కాపు సంఘం జేఏసీ సభ్యుడు ఆరేటి ప్రకాశ్‌ ఆరోపించారు. రాష్ట్రం అభివృద్ధి దిశగా అడుగులు వేయాలంటే చంద్రబాబు రావాలని ప్రకాశ్‌ అన్నారు. గతంలో కాపులకు చేకూరిన ప్రయోజనాలను జగన్‌ సర్కారు నిర్వీర్యం చేసిందని కాపు సంఘం సభ్యుడు ఆకుల రామకృష్ణ మండిపడ్డారు.

గత ప్రభుత్వం కాపు కార్పొరేషన్ ద్వారా సంక్షేమ, ఆర్థిక ప్రయోజనాలు కల్పించారని ఆరేటి ప్రకాశ్‌ తెలిపారు. కాపు కార్పొరేషన్​ను పోరాడి సాధించుకున్నామని, తద్వారా ఎన్నో ప్రయోజనాలు పొందామని, ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ తీసేసి కాపులకు అన్యాయం చేసిన ఘనత జగన్ ప్రభుత్వానికే చెల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. విదేశీ విద్యా దీవెన రాష్ట్ర ప్రభుత్వం తొలగించించటంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details