ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆకట్టుకున్న కళాంజలి ఫ్యాషన్‌షో - సంప్రదాయ దుస్తుల్లో అదరగొట్టిన చిన్నారులు - Kalanjali fashion show

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 8, 2024, 9:22 PM IST

Kalanjali Fashion Show in Chittoor District: అద్భుత వస్త్ర ప్రపంచం కళాంజలి చిత్తూరు జిల్లా రొంపిచర్లలో నిర్వహించిన ఫ్యాషన్‌ షో హుషారు రేకెత్తించింది. పట్టణంలోని ఆకాశ్‍ ఇంగ్లీష్‍ మీడియం ఉన్నత పాఠశాల గ్రాడ్యుయేషన్‍ డే (Akash English Medium School) కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫ్యాషన్‌ షో పట్టణ వాసులను ఆకట్టుకుంది. చిన్నారులు కళాంజలి వస్త్రాలను ధరించి వేదికపై అలరించారు. చిన్నారుల అవసరాలకు అనుగుణంగా సంప్రదాయ దుస్తులతో పాటు పాశ్చాత్య డిజైన్లతో రూపొందించిన వస్త్రాలు ధరించి ప్రదర్శన నిర్వహించారు. సంస్కృతి, సంప్రదాయాలను అనుసరించి రూపొందించిన కళాంజలి వస్త్రాలు చిన్నారులను మరింత అందంగా తీర్చిదిద్దాయి. 

కళాంజలి డ్రస్సులు ధరించి పిల్లలతో నిర్వహించిన ర్యాంప్‌షో తల్లిదండ్రులు, విద్యార్థులను ఆకట్టుకుంది. సంప్రదాయ వస్త్రధారణ నుంచి రకరకాల మోడల్స్ వరకు కుటుంబంలోని అందరి అభిరుచులు, అవసరాలకు తగ్గట్టుగా వస్త్రాలను తీర్చిదిద్దారు. ఇలాంటి మోడల్స్‌పై కళాంజలి మాల్​లో 20 నుంచి 50 శాతం వరకు డిస్కౌంట్ ఇస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details