ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఓటు హక్కును సమగ్రంగా వినియోగించుకుంటేనే మంచి భవిష్యత్​: రమేష్ కుమార్ - ఓటర్ల అవగాహన సదస్సు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 26, 2024, 3:44 PM IST

Kalajata Program in Voter Awareness Conference: వచ్చే ఎన్నికల్లో ఓటు హక్కును సమగ్రంగా వినియోగించుకుని ప్రజలంతా నిజాయితీ గల నాయకుడిని ఎన్నుకోవాలని మాజీ ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ సూచించారు. అనకాపల్లిలో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ ఆధ్వర్యంలో 'ఓటు వేద్దాం' పేరుతో ఓటర్ల అవగాహన సదస్సులో రాష్ట్ర స్థాయి కళాజాతా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిమ్మగడ్డ రమేశ్‌ హాజరయ్యారు. ఓటర్లను చైతన్య పరిచేలా నృత్య, సంగీత కళాకారులు సాంస్కృతిక ప్రదర్శన చేశారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ వల్ల రైతులు, సామాన్యులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయన్నారు. ఎలాంటి చర్చలు లేకుండా ప్రభుత్వం ఇలాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడ్ని ఎన్నుకోవడంతో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ వంటి చట్టాలపై పోరాటం చేసే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశాలు అన్నింటిపై ప్రజలు ఆలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు సమగ్రంగా వినియోగించుకుని మంచి నాయకులను ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. 

ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు విచక్షణతో ఉండి ఓటును వినియోగించుకోవాలి. మంచి భవిష్యత్తును ఏర్పరచుకోవటానికి మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. వ్యవస్థ సరిగా పని చేయాలంటే జవాబుదారీ తనంతో ఉండే నాయకులు కావాలి. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ ప్రకారం మనకు ఉన్న అన్ని భూములను మనవి అని నిరూపించుకోవాల్సిన అగత్యం రైతుకి ఎందుకు ఉండాలి. -నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ ఎన్నికల కమిషనర్ 

ABOUT THE AUTHOR

...view details