ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

షర్మిలకు మద్దతుగా కాకినాడలో కాంగ్రెస్ నేతల దీక్ష - కాకినాడలో కాంగ్రెస్ శ్రేణుల దీక్ష

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 2, 2024, 7:34 PM IST

Congress Leaders Agitation support of Sharmila in Kakinada: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వం తాత్సారం చేస్తోందని కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా విభజన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. వైసీపీ, తెలుగుదేశం పార్టీలు బీజేపీకి బానిసలుగా మారి రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Congress District President Pandu Ranga Rao fires: ప్రత్యేక హోదా, విభజన హామీల కోసం దిల్లీలో నిరసన చేపట్టిన ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు మద్దతుగా కాకినాడ జిల్లాలో పార్టీ శ్రేణులు దీక్ష చేపట్టారు. ఆంధ్రులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. రాష్ట్రంలో ఉన్న మూడు ప్రధాన పార్టీలు బీజేపీని విభజన హామీలు అడగడం లేదని పార్టీ జిల్లా అధ్యక్షుడు పాండు రంగారావు మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదా సహా విభజన హామీలు తీసుకొస్తామని హామీ ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details