తెలంగాణ

telangana

ETV Bharat / videos

కూటమి భయంతోనే బీజేపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారు : కడియం శ్రీహరి - Kadiyam Srihari Fires On BJP - KADIYAM SRIHARI FIRES ON BJP

By ETV Bharat Telangana Team

Published : Apr 18, 2024, 5:41 PM IST

Kadiyam Srihari Slams On BJP : బీజేపీ నాయకులకు కూటమి భయం పట్టుకుందని మాజీ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. కూటమి భయంతోనే బీజేపీ నేతలు అసత్య ప్రచారానికి తెర తీశారని అన్నారు. కడియం కావ్య లోకల్ కాదంటూ బీజేపీ నాయకులు చేసిన విమర్శలను ఆయన తిప్పికొట్టారు. సేవాభావంతో ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లోకి రావాలని, కానీ కొంతమంది నాయకులు రాజకీయాన్ని అడ్డుపెట్టుకొని కోట్ల రూపాయలను తమ జేబుల్లో నింపుకున్నారని ఆయన ఆరోపించారు. రాజకీయాన్ని అడ్డుపెట్టి కోట్లకు పడగలెత్తిన నాయకునికి వర్ధన్నపేట ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. అదే తీరుగా లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, తన కూతురు కడియం కావ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.  

బీజేపీ 200 సీట్లకే పరిమితం అవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందు వరుసలో ఉంటుందని ఆమె తెలిపారు. దేశాన్ని కార్పొరేట్ శక్తులకు మోదీ ఊడిగం చేశారని ఆరోపించారు. కేంద్రంలో మోదీని, వరంగల్​లో తన ప్రత్యర్థి రమేష్​ను ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని పార్టీ శ్రేణులను కోరారు. కాంగ్రెస్​తోనే దేశాభివృద్ధి జరుగుతుందని అన్నారు. అంతకు ముందు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో పాటు పలువురు ఎమ్మెల్యేలు హాజరయ్యారు.  

ABOUT THE AUTHOR

...view details