LIVE : కె.కేశవరావు మీడియా సమావేశం - ప్రత్యక్షప్రసారం - K keshava rao live - K KESHAVA RAO LIVE
Published : Mar 29, 2024, 3:04 PM IST
|Updated : Mar 29, 2024, 3:48 PM IST
లోక్‌సభ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్‌లోకి చేరికల ప్రవాహం కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హస్తం కండువా కప్పుకోగా, బీఆర్ఎస్ కీలక నేతలు కె.కేశవరావు, కడియం శ్రీహరి, తమ కుమార్తెలతో కలిసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ ఎంపీ కె. కేశవరావు నేడు సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీతో కలిసి రేవంత్‌తో భేటీ అయ్యారు.తాను త్వరలోనే కాంగ్రెస్‌లో చేరనున్నట్లుగా రేవంత్ రెడ్డితో కేకే చెప్పినట్లుగా సమాచారం. ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఆధ్వర్యంలో చేరనున్నట్లుగా సమాచారం. చాలా ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో కేకే పని చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పీసీసీగా పని చేసిన అనుభవం, మంత్రిగా చేసిన అనుభవం ఉంది. కాంగ్రెస్ పార్టీలో సైతం కేకేకు సముచిత స్థానం లభించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తన పార్టీ మార్పుపై కేకే స్పష్టత ఇస్తున్నారు.
Last Updated : Mar 29, 2024, 3:48 PM IST