'ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది'- వైసీపీ కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దు: నాగబాబు - NAGABABU Tweet - NAGABABU TWEET
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 12:41 PM IST
JSP Leader Nagababu Released video in Twitter: ఎన్నికల ఫలితాలు వెలువడే నేపథ్యంలో ఓటమి భయంతో వైఎస్సార్సీపీ దాడులు చేసే అవకాశం ఉందని జనసేన నేత నాగబాబు అన్నారు. కూటమి నేతలు, జనసైనికులు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ పరాజయం అంచుల్లో ఉందని ఓట్ల లెక్కింపు సమయంలో సంయమనం పాటించి ఈసీకి సహకరిద్దామని పార్టీ నేతలకు ఆయన పిలుపునిచ్చారు. వైసీపీ నేతలు చేసేటటువంటి కవ్వింపు చర్యలకు ప్రతిస్పందించొద్దని ఆయన అన్నారు. మనం ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని నాగబాబు పేర్కొన్నారు. ఓటింగ్ ప్రక్రియ రోజు ప్రభుత్వానికి, పోలీసులకు సహకరించాలని ఆయన పార్టీ నేతలను కోరారు.
'ఏమి లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది' అన్నట్టు మనమంతా సంయమనం పాటించి ప్రజాస్వామ్యాన్ని గౌరవిద్దామని నాగబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఓడిపోతాం అనే భయంతో వైసీపీ దాడులకు పాల్పడే అవకాశం ఉంటుందని కావున ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కచ్చితంగా కూటమి ప్రభుత్వమే గెలుస్తుందని ప్రజా ప్రభుత్వమే ఏర్పడబోతోందని ఎక్స్ వేదికగా నాగబాబు ఓ వీడియో విడుదల చేశారు.