దేవర సినిమా చూస్తూ అభిమాని గుండెపోటుతో మృతి - Young Tiger NTR Fan Died in kadapa - YOUNG TIGER NTR FAN DIED IN KADAPA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 27, 2024, 4:51 PM IST
Jr.NTR Fan died while watching Devara movie:కడపలో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ అభిమాని 'దేవర' సినిమా చూస్తూ గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. స్పృహ తప్పిన కొద్ది సేపటికి ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందినట్లు వైద్య బృందం వెల్లడించడం గమనార్హం.
వైఎస్ఆర్ జిల్లా చింతకొమ్మదిన్నె మండలం జమ్మలపల్లి కి చెందిన మస్తాన్ వల్లి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని. దేవర సినిమా విడుదలైన సందర్భంగా కడప అప్సర థియేటర్ లో తెల్లవారుజామున సినిమా చూస్తూ ఈలలు, కేకలు వేస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో గుండెపోటుతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే హుటాహుటిన అతడిని ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
మస్తాన్ (మృతుడి)కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మస్తాన్ వల్లి మృతి చెందడంతో కుటుంబం అనాధగా మారింది. ఇతని మరణంతో వీరి ఇంటి వద్ద విషాద ఛాయలు అలముకున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ దయార్థ హృదయంతో కుటుంబాన్ని ఆదుకోవాలని బంధువులు, స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.