అదృష్టం అంటే ఇతనిదే - లక్కీ డ్రాలో కిలో బంగారం గెలుచుకున్న రంగారెడ్డి వాసి - Jos Alukkas Gold Lucky Draw
Published : Feb 1, 2024, 8:49 PM IST
Jos Alukkas One Kg Lucky Draw Gold Winner : రంగారెడ్డి జిల్లా కొంగర కలన్‌కు చెందిన జంగారెడ్డి అనే రైతును అదృష్టం వరించింది. దేశవ్యాప్తంగా నిర్వహించిన జోస్ అలుక్కాస్ జువెల్లరీ షాపింగ్ ఫెస్టివల్-2023 లక్కీ డిప్‌లో ఆయన కిలో బంగారాన్ని గెలుచుకున్నారు. జంగారెడ్డి గత ఏడాది దిల్సుఖ్నగర్లోని జోస్ అలుక్కాస్ జ్యువెల్లర్స్‌లో బంగారం కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు ఇండియా జ్యువెల్లరీ షాపింగ్ ఫెస్టివల్ కూపన్ను నిర్వాహకులు అందజేశారు.
Lucky draw one kg Gold Winner : ఇటీవల కొనుగోలుదారుల వద్ద ఉన్న కూపన్ల నంబర్లను లక్కీ డ్రా తీయగా, జంగారెడ్డి కిలో బంగారం గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ బహుమతి ప్రదానోత్సవం కార్యక్రమం జరిగింది. ఇందులో ముఖ్య అతిథిగా జోస్ అలుక్కాస్ డైరెక్టర్ పాల్ అలుక్కా, ఆల్ ఇండియా జెమ్, జ్యువెల్ డొమెస్టిక్ కౌన్సిల్ నేషనల్ డైరెక్టర్ మోహన్ లాల్ జైన్, జీఎంజే సీనియర్ రీజినల్ మేనేజర్ వెంకటరామన్ పాల్గొన్నారు. అనంతరం 1 కిలో బంగారాన్ని లక్కీ డిప్ విజేత రైతు జంగారెడ్డికి ప్రదానం చేశారు.