ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

గురజాలలో 27న జాబ్ మేళ: మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు - Job Mela in Gurajala on jan 27

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2024, 2:01 PM IST

Updated : Jan 26, 2024, 2:23 PM IST

Job Mela in Gurajala on jan 27: నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సుమారు 50 కంపెనీలతో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు టీడీపీ నేత, గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు తెలిపారు. పల్నాడు జిల్లా ఈ నెల 27న గురజాల వాగ్దేవి కాలేజీ ఆవరణలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తామని ఆసక్తి గల యువతీ యువకులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని యరపతినేని కోరారు. 

TDP Former MLA Srinivasa Rao Fires on YSRCP: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతను గాలికి వదిలేసిందని లక్షల ఉద్యోగాలు ఇస్తానని హామీ ఇచ్చి యువతరాన్ని మోసం చేసిందని ఆరోపించారు. తాము అధికారంలోకి రాగానే యువతీ యువకులకు ఉద్యోగాలతో పాటు నిరుద్యోగ భృతి అందిస్తామన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ విధ్వంసకర పాలన చేస్తుందని శ్రీనివాసరావు మండిపడ్డారు. డీఎస్సీ ప్రకటించకుండా, రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు తీసుకురాకుండా, ఉన్న పరిశ్రమలు వెల్లగొట్టి రాష్ట్రాన్ని వైఎస్సార్సీపీ నాశనం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో మూడు నెలల్లో రాష్ట్ర ప్రజలు వైసీపీకి ముగింపు పలకడానికి సిద్ధంగా ఉన్నారని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.

Last Updated : Jan 26, 2024, 2:23 PM IST

ABOUT THE AUTHOR

...view details