ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కోట్ల రూపాయల ప్రజాధనం వృథా!- మందుబాబులకు అడ్డాగా జేఎన్‌ఎన్‌ఏయూ ఆర్‌ఎం ఇళ్లు - Condition of JNNAURM houses

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 12, 2024, 1:03 PM IST

JNNURM Houses Become Bases for Anti Social Activities: జగన్ సర్కార్ కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వృధా చేస్తోంది అనడానికి విజయవాడలోని జేఎన్‌ఎన్‌ఏయూఆర్‌ఎం ఇళ్లే ప్రత్యక్ష ఉదాహరణ. అక్కడ ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడంతో జేఎన్‌ఎన్‌ఏయూఆర్‌ఎం (Jawaharlal Nehru National Urban Renewal Mission) ఇళ్లు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. చీకటి పడితే గంజాయి బ్యాచ్, మందు బాబులు ఈ ప్రాంతంలో రెచ్చిపోతున్నారని స్థానికులు చెబుతున్నారు.

మద్యం మత్తులో ఇళ్లకు ఉన్న తలుపులను పీకేస్తున్నారని కిటికీలకు ఉన్న అద్దాలను పగులగొడుతున్నారని అన్నారు. అక్కడకు రాత్రి వేళల్లో మందు బాబులు వస్తుండటతంతో భయాందోళనకు గురవుతున్నామని స్థానికులు అన్నారు. మద్యం సీసాలతో, పేక ముక్కలతో ఇళ్లు దర్శనమిస్తున్నా పట్టించుకునేవారే లేరని స్తానికులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయవాడలో ఇళ్లు లేనివారికి అమరావతి, కొండాపావులూరు, వణుకురు లాంటి దూర ప్రాంతాల్లో ఇంటి స్థలాలను కేటాయించింది. అదే తమకు దగ్గరలో ఉన్న ఈ ఇళ్లను కేటాయిస్తే బాగుంటుందని స్థానికులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details