బదిలీ ఓట్లపై జేసీ విచారణ- చిరునామా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి పరిశీలన - JC investigate of Theft Votes
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 9, 2024, 1:35 PM IST
JC investigation on Allegations of Theft Votes: పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరునుంచి అద్దంకికి బదిలీ అయిన 21 ఓట్లపై జేసీ శ్రీధర్ స్వయంగా విచారణ జరిపారు. దొంగఓట్లపై పెద్దఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో స్వయంగా జేసీనే రంగంలోకి దిగి విచారించారు. సోమవారం ప్రచురితమైన ఈనాడు కథనానికి స్పంచిందిన ఆయన భవాని కూడలి, భాగ్యనగర్లోని ఇళ్ల వద్ద విచారణ చేయగా కొంతమంది మాత్రమే అందుబాటులోకి వచ్చారు. మిగిలిన వారు హాజరు కాలేదు. ఒకరిద్దరు ఇంటి వద్ద విచారణ సమయంలో హాజరు కాకపోగా, కొంతమంది ఆ తర్వాత అధికారి వద్ద హాజరయ్యారు. భాగ్యనగర్‌లోని మరో ఇంటిలో ఎవరూ లేరు. ఈ సందర్భంగా వీఆర్వోపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ధ్రువపత్రం ఇవ్వకుండా ఈ చిరునామాతో వారికి ఓట్లు ఎలా వచ్చాయని మండిపడ్డారు
స్థానిక ధ్రువపత్రం ఇవ్వకుండా ఈ చిరునామాతో వారికి ఓట్లు ఎలా వచ్చాయని ఆయన మండిపడ్డారు. జేసీ విచారణ నిమిత్తం రావడంతో వివరాలు వెల్లడించడం కుదరని వీఆర్ఓ పేర్కొన్నారు. ఓట్ల అక్రమాలపై ఎస్‌ఈసీ నివేదిక కోరితే దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఆగమేఘాల మీద తాజాగా ఆ ఓట్లను మ్యాపింగ్ చేశారు.