ETV Bharat / state

నేడు అసెంబ్లీలో నాలుగు బిల్లులు - ఉద్యోగుల బదిలీపై మంత్రి నారాయణ సమాధానం - STATE LEGISLATIVE ASSEMBLY

ఏడో రోజు శాసనమండలి సమావేశాలు - అసెంబ్లీ ఆమోదించిన వివిధ బిల్లులు శాసనమండలికి

Seventh Day of Legislative Council Meetings
Seventh Day of Legislative Council Meetings (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 19, 2024, 7:05 AM IST

Seventh Day of Legislative Council Meetings : శాసనసభ సమావేశాల్లో నేడు నాలుగు బిల్లులను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. సహకార సొసైటీల చట్ట సవరణ బిల్లును మంత్రి అచ్చెన్నాయుడు ప్రవేశ పెట్టనున్నారు. ఎక్సైజ్ చట్టసవరణ బిల్లు, విదేశీ మద్యం వాణిజ్యం చట్ట సవరణ బిల్లును, ప్రొహిబిషన్ చట్ట సవరణ బిల్లులను మంత్రి కొల్లు రవీంద్ర ప్రవేశపెట్టనున్నారు. విశాఖ రుషికొండపై అక్రమ నిర్మాణాలు, పోలవరం, ఇతర జలవనరుల ప్రాజెక్టులపై సభలో లఘు చర్చ జరుగనుంది.

Legislative Council Approves Various Bills Passed by Assembly : అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఉద్యోగుల అంతరాష్ట్ర బదిలీలు, సాగునీటి కాల్వల నిర్వహణ, ఆక్వా రైతులకు పన్ను విధింపు, విద్యార్థులకు ఆర్థిక సాయం, కడప జిల్లాలో ఎస్సీ, ఎస్టీలకు వాహనాల పంపీణి తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇవ్వనున్నారు. పాడేరు ఐటీడీఏ ప్రాజెక్ట్, అడవివల్లి ప్రాజెక్ట్ , చేనేత కార్మీకులకు ప్రొత్సాహకాలు, కార్మిక సంక్షేమ మండలి, డ్వాక్రా సున్నావడ్డీ పథకం తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలు ఇస్తారు. అసెంబ్లీ ఆమోదించిన వివిధ బిల్లులను నేడు శాసనమండలిలోనూ ఆమోదించనున్నారు.

20 మంది విప్​లు - అన్ని వర్గాలకు సముచిత న్యాయం!

మండలి ప్రశ్నోత్తరాల్లో భాగంగా మదనపల్లిలో భూరికార్డుల దగ్ధం, రైతులకు ఆర్థిక సహాయం, భీమిలిలోని శారదా పీఠానికి భూములు కేటాయింపు, నెల్లిమర్ల జనపనార మిల్లు మూసివేత, విశాఖపట్నంలోని రుషికొండలో పర్యాటకం తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానం ఇవ్వనున్నారు. రాష్ట్రంలో నూతన జాతీయ రహదారుల మంజూరు, టీటీడీ లడ్డూ ప్రసాదంలో కల్తీనెయ్యి వినియోగం, రాష్ట్రంలో ఓడరేవులు, ఫిషింగ్ హర్బర్, ఆరోగ్యశ్రీ పథకంలో అక్రమాలు,వరదల కారణంగా పంట నష్టం,గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు, పంచాయతీ భవనాలకు రంగులు తదితర ప్రశ్నలకు మంత్రులు సమాధానాలివ్వనున్నారు.

వైఎస్సార్సీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పట్టణాల్లో అసంపూర్తిగా నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టుల పనులు తిరిగి ప్రారంభించి పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి నారాయణ తెలిపిన సంగతి తెలిసిందే. ఎమ్మిగనూరులో అసంపూర్తిగా నిలిచిపోయిన తాగునీటి ప్రాజెక్టుల గురించి వివరాలు వెల్లడించిన విషయం విదితమే.

శాసనమండలి ప్రతిపక్ష నేతగా బొత్స సత్యనారాయణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.