ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

టీడీపీ - జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 పార్లమెంటు సీట్లు ఖాయం: పృథ్వీరాజ్‌ - tdp janasena winning seats

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 11, 2024, 9:59 AM IST

Janasena Prudhvi Raj Comments: రానున్న 40 రోజుల్లో రాష్ట్ర పరిస్థితి మారబోతుందని సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ తెలిపారు. 2024 ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందని, తెలుగుదేశం పార్టీ జనసేన కూటమికి 136 అసెంబ్లీ, 21 పార్లమెంట్ సీట్లు రావడం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఎంతో అభివృద్ధి చేసిన చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రం మరింత అభివృద్ధి చేసేందుకు వీలవుతుందని పృథ్వీరాజ్ తెలిపారు.

టీడీపీ - జనసేన కూటమి అధికారంలోకి వస్తే వైసీపీ అందిస్తున్న పథకాల కన్నా ఎక్కువగా అందిస్తామని, ప్రస్తుతం ఉన్న వాటిని రద్దు చేయమని ఆయన తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తాను జనసేన - టీడీపీ అభ్యర్థుల విజయానికి ప్రచారం మాత్రమే చేస్తానని, పోటీ చేయనని ఆయన తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను మాత్రమే ప్రచారం చేస్తామని, వైసీపీ వారిలా అసభ్య పదజాలం మాట్లాడమన్నారు. జగన్‌ మాటలు నమ్మి నాలుగున్నరేళ్లుగా నరకయాతన అనుభవిస్తున్నామని ప్రజలే బహిరంగంగా చెప్తున దుస్థితి ఏర్పడిందని పృథ్వీరాజ్‌ విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details