రాయి దాడి ఘటనపై లోతైన విచారణ జరిపించాలని ఈసీకి ఫిర్యాదు చేసిన జనసేన - stone attack investigation - STONE ATTACK INVESTIGATION
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 16, 2024, 10:28 PM IST
Janasena leaders complain to CEO: సీఎం జగన్ సిద్ధం బస్సు యాత్రలో పై రాయిదాడి (stone attack) ఘటనలో లోతైన విచారణ జరిపించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ జనసేన పార్టీ, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ మీనాకు వినతిపత్రం ఇచ్చింది. దాడి ఘటనపై విచారణ చేస్తున్న విజయవాడ సీపీ, డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీలపైనే ఆరోపణలు తలెత్తుతున్నాయని జనసేన ఫిర్యాదులో ఆరోపించింది. దర్యాప్తు నిష్పాక్షికంగా జరుగుతుందన్న విశ్వాసం లేదని జనసేన తన ఫిర్యాదులో పేర్కోంది. రాయి దాడి ఘటన చాలా అనుమానాలకు తావిస్తోందని వెల్లడించింది. ఈ వ్యవహారాన్ని లోతుగా విచారణ చేసేలా చర్యలు చేపట్టాలని కోరుతూ జనసేన పార్టీ నేతలు సీఈఓకి ఫిర్యాదు చేశారు. రాయిదాడి ఘటన సీఎం జగన్ భద్రతనే సవాలు చేసేలా ఉందని జనసేన పేర్కోంది. మరోవైపు ఇటీవల ప్రధాని పాల్గోన్న సభలోనూ భద్రతా వైఫల్యం తలెత్తిందని గుర్తుచేసింది. ఈ ఘటనపై సైతం సరైన విచారణ జరగలేదని జనసేన తన ఫిర్యాదులో పేర్కోంది.