ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దీపావళి దుకాణాల ఏర్పాటులో కాసుల వేట- పీతల - JANASENA CORPORATOR MURTHY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 27, 2024, 3:24 PM IST

Janasena Corporator Murthy Allegations against Visakha Mayor and Deputy Mayors : దీపావళి దుకాణాల కేటాయింపు విషయంలో నిర్వహకుల నుంచి పెద్ద మొత్తంలో విశాఖ మేయర్ హరి కుమారి, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్ ​దోచుకున్నారని జనసేన కార్పొరేటర్​ పీతల మూర్తి యాదవ్​ వెల్లడించారు. దుకాణాలు దక్కించుకున్న వారిని బెదిరించి, నిధులు దోచుకోవడంతో బాధితులు మూడవ పట్టణ పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారని తెలియజేశారు. దీంతో పోలీసులు ఉపమేయర్​పై ఎఫ్​ఐఆర్​ నమోదైందని పేర్కొన్నారు.

బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టారని పీతల మూర్తి యాదవ్​ తెలియజేశారు. వారు ఆ పదవుల్లో కొనసాగడానికి ఎంత మాత్రం అర్హులు కారని, వెంటనే రాజీనామాలు సమర్పించి పక్కకు తప్పుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కొ దుకాణ నిర్వహకుడి నుంచి లక్ష రూపాయల చొప్పున వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని మూర్తి యాదవ్ ప్రశ్నించారు. జీవీఎంసీ అగ్నిమాపకాధికారి నుంచి నిరభ్యంతర ధ్రువీకరణ పత్రంతో సంబంధం లేకుండా దుకాణాలకు లైసెన్స్​లు జారీ చేయించారని వివరించారు. నగరంలో రాత్రి ఆహారవీధి ఏర్పాటు, కొనసాగింపులో మరోనేత కీలకంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details