జగన్ ఉద్యోగులతో పాటు పోలీసులను దగా చేశారు: నాగబాబు - Nagababu responded on Police issues - NAGABABU RESPONDED ON POLICE ISSUES
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 27, 2024, 5:20 PM IST
Jana Sena leader Nagababu: జీతాలు పెంచుతాం, సీపీఎస్ రద్దు చేస్తానంటూ సీఎం జగన్ ఉద్యోగులతో పాటుగా పోలీసులను మోసం చేశాడని జనసేన నేత నాగబాబు ఆరోపించారు. వీక్లీ ఆఫ్ పేరుతో పోలీసులను మభ్యపెట్టి డబుల్ డ్యూటీలతో వైసీపీ ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని మండిపడ్డారు. ఐదేళ్లుగా పోలీసులకు రావాల్సిన డీఏ, టీఏ బకాయిలు, సరెండర్ లీవ్‌ల చెల్లింపులతో పాటు జీపీఎఫ్ నగదు జగన్ దోచేశారని విమర్శించారు.
పోలీసులపై ఒత్తిడి పెరుగుతున్నా, ఈ ఐదు సంవత్సరాల్లో కొత్త ఉద్యోగాలు సృష్టించలేదని ఎద్దేవా చేశారు. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వేసిన జగన్, మళ్లీ వాటిపై కేసులు వేశాడని దుయ్యబట్టారు. ఎవరైనా తమ సొమ్ముపోతే పోలీసుల వద్దకు పోతారు, పోలీసుల డబ్బులు పోతే ఎవ్వరి దగ్గరికి పోవాలో ఆలోచించాలని పేర్కొన్నారు. సీఎం జగన్ పోలీసులను స్వంత అవసరాలకు వాడుకుంటున్నాడని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం కోసం పని చేసే పోలీసులు ఒక్క సారి ఆలోచించాలని పేర్కొన్నారు. త్వరలో రాబోయే కూటమి ప్రభుత్వంలో పోలీసులను తప్పకుండా ఆదుకుంటామని నాగబాబు హామీ ఇచ్చారు.