తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎంపీ అనిల్​ కుమార్​ యాదవ్​కు ఊహించని గిఫ్ట్​ ఇచ్చిన జగ్గారెడ్డి​ - ఏంటో తెలుసా? - Jaggareddy Gifted Gold Chain - JAGGAREDDY GIFTED GOLD CHAIN

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 10:23 PM IST

Jaggareddy Gifted Gold Chain To MP Anil Kumar Yadav : రాజ్యసభ సభ్యుడు అనిల్‌ కుమార్‌ యాదవ్‌కు పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జగ్గారెడ్డి బంగారు గోల్డ్​ చైన్ బహుమతిగా అందజేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇవాళ గాంధీభవన్​కు వచ్చిన అనిల్‌ కుమార్‌ వరుసగా కాంగ్రెస్‌ నాయకులను కలిశారు. ఈ సందర్భంగా గాంధీ భవన్‌ కాన్ఫరెన్స్‌ హాలులో ఉన్న జగ్గారెడ్డిని మర్యాదపూర్వకంగా అనిల్‌ కుమార్‌ కలిశారు.

ఈ సందర్భంగా గట్టిగా కౌగిలించుకుని దీవించిన జగ్గారెడ్డి, తన మెడలో ఉన్న 10 తులాల బంగారు గొలుసును తీసి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మెడలో వేశారు. తిరిగి ఇవ్వబోతే ఆయన తీసుకోలేదు. ఒక్కసారి ఇచ్చిన బంగారాన్ని తిరిగి తీసుకోనని నిరాకరించారు. దాదాపు 10 తులాలు కలిగిన బంగారు గొలుసును అనిల్‌ కుమార్‌కు ఇవ్వడంతో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయారు. ఎమ్మెల్సీ, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్​ కుమార్‌ గౌడ్‌, ప్రచార కమిటీ ఛైర్మన్‌ మధుయాస్కీ, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌, పీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షులు కుమార్‌ రావు, జి.నిరంజన్‌ తదితరులతో పాటు పలువురు నాయకులను అనిల్‌ కుమార్‌ యాదవ్‌ కలిశారు.  

ABOUT THE AUTHOR

...view details