ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఓటరు జాబితాలో అవకతవకలు: ఫొటోలకు బదులు పాసుపుస్తకాలు, ఆధార్‌కార్డులు - officials negligence in voter list

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 6:16 PM IST

Irregularities in Nandigama Voter List: తాజాగా విడుదలైన ఓటర్ల తుది జాబితాలో చిత్రవిచిత్రాలు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ పురపాలక సంఘం పరిధిలో పలువురికి మూడేసి ఓట్లు, కొందరు ఫొటోలకు బదులు పాస్‌పుస్తకాలు, ఇతర గుర్తింపు కార్డులు కనిపిస్తున్నాయి. డబుల్ ఓట్లు, స్థానికేతరులు ఓట్లు, మృతుల ఓట్లు కొనసాగుతూ బతికున్న వాళ్ల ఓట్లు గల్లంతయ్యాయి. ఇలా జాబితాలో వెతికే కొద్ది తప్పులు కనిపిస్తున్నాయి. ఓటర్ల జాబితాల్లో తప్పులు సరిచేయాలని ఎన్నికల సంఘం అధికారులకు ఎన్నిసార్లు ఆదేశించినా క్షేత్రస్థాయిలో అక్రమాలు కొనసాగుతున్నాయి.

నందిగామ మండలం పల్లగిరి, అంబారుపేట గ్రామాల్లో ఓటర్ల జాబితాల్లో ఒక్కక్కొరికి 2,3 ఓట్లు ఉండటంతో పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి 15 ఏళ్ల క్రితం వెళ్లిపోయి, వివాహాలై వేర్వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న వారి ఓట్లు ఇంకా జాబితాలో ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మృతి చెందిన వ్యక్తికి ఇంకా ఓటు ఉంది. ఇదే పోలింగ్‌ కేంద్రంలో బతికి ఉన్న మహిళ ఓటును తొలగించారు. సాంకేతిక పరిజ్ఞానం ఇంత పెరిగినా ఇంకా తప్పులు లేకుండా, అర్హులతో ఓటర్ల జాబితాను తీసుకరావటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

ABOUT THE AUTHOR

...view details