తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఇండియా - బంగ్లాదేశ్ మూడో టీ20 మ్యాచ్ - హైదరాబాద్ చేరుకున్న భారత ఆటగాళ్లు - INDIAN PLAYERS REACHED HYDERABAD

By ETV Bharat Telangana Team

Published : Oct 10, 2024, 10:03 PM IST

India Team Reached Hyderabad : భారత్-బంగ్లాదేశ్ మధ్య ఉప్పల్ వేదికగా శనివారం మూడో టీ20 మ్యాచ్ జరుగనుంది. ఇందుకోసం భారత ఆటగాళ్లు హైదరాబాద్‌కు చేరుకున్నారు. దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయం చేరుకున్న టీమ్​ఇండియా ప్లేయర్లు అక్కడి నుంచి పార్క్ హయత్ హోటల్​​కి చేరుకున్నారు. అక్కడే బస చేయనున్నారు. ఇదిలా ఉంటే భారత ఆటగాళ్లకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులు స్వాగతం పలికారు. 

కాగా ఇప్పటికే మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా టీమ్​ఇండియా రెండు టీ20 మ్యాచ్‌లు గెలిచింది. సిరీస్​ను భారత్ 2-0తో సొంతం చేసుకోగా ఈనెల 12న ఉప్పల్​లో నామ మాత్రపు మ్యాచ్ జరుగనుంది. చాలా రోజుల తర్వాత ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుంది. ఈ క్రమంలో క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆన్‌లైన్​లో ముందుగా టికెట్లు బుక్‌ చేసుకున్న వారు జింఖానా స్టేడియంలో ఉదయం 11 నుంచి సాయంత్రం 7 గంటల వరకు రిడంప్షన్‌ చేసుకోవాలని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఐడీ కార్డు చూపించి, ఆన్​లైన్‌ టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రింట్‌ చూపించి టికెట్లు పొందాలని కోరారు. మ్యాచ్ టిక్కెట్లను ఈసారి ఆఫ్​లైన్ కౌంటర్లలో విక్రయించడం లేదని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details