భద్రతపై భరోసా - విశాఖలో భారత్-ఫ్రెంచ్ నేవీ విన్యాసాలు - భారత్ ఫ్రెంచ్ సంయుక్త విన్యాసాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 15, 2024, 7:23 PM IST
India French Exercise in INS Dega Visakhapatnam : భారత్ - ఫ్రెంచ్ నౌకాదళ విమానాల సంయుక్త విన్యాసాలు విశాఖ కేంద్రంగా ప్రారంభమయ్యాయి. తూర్పు నౌకాదళ కమాండ్ అట్లాంటిక్ 2, ఫ్రెంచ్ మారిటైమ్ పెట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ఎయిర్‌బస్ A400, ఫ్రెంచ్ ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌లతో ఈ సంయుక్త విన్యాసాలు 'ఐఎన్ఎస్ డేగా' వేదికగా మొదలయ్యాయి. స్నేహపూర్వక సంబంధాల పెంపుదల భాగంగా ఇరు నేవీలకు చెందిన విమానాల సిబ్బంది పరస్పర సాంకేతిక అవగాహన విన్యాసాలలో భాగంగా ఈ సదస్సు ఏర్పాటు చేశారు. ఇరుదేశాల ద్వైపాక్షిక విన్యాసాల ద్వారా స్నేహ పూర్వక సంబంధం, పరస్పర సహకారం పెంపొందించుకునేందుకు వీటిని రూపకల్పన చేశారు.
Indian, French Navies hold joint drills in Bay of Bengal : భారతదేశానికి చెందిన P8I, ఫ్రాన్స్‌కు చెందిన అట్లాంటిక్ 2 సినర్జీ, ఇంటర్ ఆపరేబిలిటీని మెరుగుపరచడానికి బంగాళాఖాతంపై సంయుక్త విన్యాసాలు చేపట్టాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో నికరంగా భద్రత పై భరోసా కల్పించేందుకు ఈ రెండు దేశాలు పరస్పరం ఈ రకంగా సహకరించుకుంటున్నాయి.