LIVE : ఎర్రకోటలో ఘనంగా 78వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు - Independence Day 2024 LIVE
Published : Aug 15, 2024, 7:10 AM IST
|Updated : Aug 15, 2024, 9:35 AM IST
Independence Day 2024 LIVE : 78వ స్వాతంత్య్ర దినోత్సవాలకు యావత్ భారతావని ముస్తాబైంది. ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వ సారి జాతీయ జెండా ఎగుర వేశారు. ఎర్రకోట వద్ద ప్రధానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ నేతృత్వంలోని బృందం స్వాగతం పలికింది. తర్వాత త్రివిధ దళాల గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. అనంతరం త్రివర్ణ పతకాన్ని ఎగురువేశారు. ఆ సమయంలో హెలికాప్టర్లు ద్వారా పూల వర్షం కురిపించారు. తర్వాత జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ, వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా 2047నాటికి నిర్దేశించుకున్న లక్ష్యాలు, అందుకు కార్యాచరణను వివరిస్తున్నారు. పంద్రాగస్టు సందర్భంగా ఎర్రకోట నుంచి వరుసగా పదేళ్లు పతాకావిష్కరణ చేసిన కాంగ్రెసేతర పార్టీల ప్రధానమంత్రుల్లో మొట్టమొదటి నేతగా నరేంద్ర మోదీ నిలిచానారు. ఈ వేడుకలకు దాదాపు 6 వేల మంది ప్రత్యేక అతిథులను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. అతిథుల్లో రైతులు, యువత, మహిళలు సహా వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 117 మంది అథ్లెట్లు, క్రీడాకారులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు.
Last Updated : Aug 15, 2024, 9:35 AM IST