ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

యథేచ్చగా కొనసాగుతున్న ఇసుక దందా- తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ, జనసేన నేతలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 10:20 AM IST

Illegal Soil Excavation in Krishna District: రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. వైఎస్సార్సీపీ నేతల అండదండలతోనే ఇసుక రవాణా జరుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగున్నరేళ్లుగా సహజ వనరుల్ని చెరబట్టి దొరికినకాడికి తవ్వుకుని వంతులు వేసుకుని వాటాలు పంచుకున్నారు! కృష్ణా జిల్లాలో వైఎస్సార్సీపీ నేతలు సహజ వనరులను గుల్లచేసి కోట్ల రూపాయలను పోగేసుకున్నారు. ముఖ్యంగా ఇసుక నుంచి కోట్లు కొల్లగొడుతున్నారు. కృష్ణా నది నుంచి హైదరాబాద్‌కు ఇసుక లారీలు వరుస కట్టాయి. రోజుకు సగటున వంద లారీలు! ఒక్కో దానిలో కనీసం 50 నుంచి 60 టన్నులు. 

YSRCP Leaders Sand Mining Mafia: ఈ క్రమంలో జిల్లాలోని ఘంటసాలలో అక్రమ ఇసుక తవ్వకాలను టీడీపీ, జనసేన నేతలు అడ్డుకున్నారు. నిర్వాహకులు రాత్రిపూట అక్రమంగా తవ్వకాలు చేపట్టడంపై ఎంపీటీసీ వెంకటేశ్వరరావు ఆగ్రహించారు. అధికార పార్టీ నేతల ప్రోత్సాహంతో భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని తహసీల్దార్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అక్రమ తవ్వకాలు ఆపకపోతే నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details