ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అల్లూరి జిల్లా కలెక్టర్​ పశ్చిమ గోదావరి జిల్లాకు బదిలీ - IAS Transfers in AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 9:39 PM IST

IAS Officers Transfers in AP : రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఐఏఎస్​ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా తాజాగా మరి కొంతమందిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బదిలీ చేసిన ప్రభుత్వం ఆయన్ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్​గా నియమిస్తూ ఆదేశాలు ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతిని బదిలీ చేసిన ప్రభుత్వం ఆమెను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్​గా బదిలీ చేశారు.  

అల్లూరి జిల్లా కలెక్టర్​గా ఎం. విజయసునీతను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ పౌరసరఫరాల కార్పోరేషన్ ఎండీ వీరపాండియన్​కు సివిల్ సప్లైస్ డైరెక్టర్​గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఐఎఫ్ఎస్ అధికారి రాహుల్ పాండేను వ్యవసాయ మార్కెటింగ్ శాఖ బాద్యతల నుంచి రిలీవ్ చేస్తూ సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాలని ఆదేశాలు ఇచ్చారు.

ABOUT THE AUTHOR

...view details