రాష్ట్రంలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ- ఉత్తర్వులు జారీ చేసిన జగన్ సర్కార్ - officers transfers in ap
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 8, 2024, 2:09 PM IST
IAS Officers Transfers in AP: రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఐఏఎస్ అధికారుల బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయగా తాజాగా మరి కొంతమందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాబు.ఏ ను మార్కెటింగ్ శాఖ కార్యదర్శిగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీ డెయిరీ ఎండీ, అమూల్ ప్రాజెక్టు స్పెషల్ ఆఫీసర్‌గానూ ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
గ్రామ, వార్డు సచివాలయాల అదనపు డైరెక్టర్‌గా అభిషేక్ గౌడకు ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఏపీ మార్క్ ఫెడ్ ఎండీగా జి.శేఖర్ బాబును బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీగా ఎం. శివప్రసాద్‌ను ప్రభుత్వం నియమించింది. కె.వెట్రిసెల్విని మహిళా శిశు సక్షేమం, దివ్యాంగుల విభాగం ఓఎస్డీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను బదిలీ చేయటం చర్చనీయాంశంగా మారింది.