తెలంగాణ

telangana

ETV Bharat / videos

ప్రభుత్వ పుస్తక ముద్రణా కార్యాలయంలో అగ్నిప్రమాదం - యంత్రాలు, పుస్తకాలు దగ్ధం - హైదరాబాద్​లో అగ్ని ప్రమాదం

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 1:41 PM IST

Hyderabad Fire Accident : హైదరాబాద్ మింట్ కాంపౌండ్​లోని ప్రభుత్వ పాఠ్యపుస్తక ముద్రణా కార్యాలయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ అగ్నిప్రమాదంలో పుస్తకాలు ముద్రించే యాత్రలు, పలు పుస్తకాలు అగ్నికి ఆహుతి అయ్యాయి. కార్యాలయంలో పని చేసే సిబ్బంది గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఫైర్​ ఇంజిన్​ల సాయంతో అదుపులోకి తీసుకువచ్చారు. 

Fire Accident at Govt Book Printing Office : అగ్నిమాపక సిబ్బంది సకాలంలో రావడంతో మంటలు త్వరితగతిన అదుపులోకి వచ్చాయి. విద్యుదాఘాతం వల్లే ఈ అగ్నిప్రమాదం సంభవించినట్లు ఫైర్​ సిబ్బంది వెల్లడించారు. తెల్లవారు జామున ఈ అగ్నిప్రమాదం జరగడంతో ఉద్యోగులు, కార్మికులు ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని తెలిపారు. ప్రాణ నష్టం తప్పడంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details