తెలంగాణ

telangana

ETV Bharat / videos

నాగార్జునసాగర్​లో 22 గేట్లు ఓపెన్​ - మొదలైన పర్యాటకుల సందడి - Huge Tourist at NagarjunaSagar - HUGE TOURIST AT NAGARJUNASAGAR

By ETV Bharat Telangana Team

Published : Aug 6, 2024, 4:16 PM IST

Huge Tourist at Nagarjuna Sagar : నాగార్జునసాగర్​ ప్రాజెక్టు 22 గేట్లను అధికారులు మంగళవారం తెరిచారు. దీంతో ఆ ప్రాంతంలో పర్యాటకుల సందడి నెలకొంది. సాగర్​ అందాలు చూడడానికి భారీ సంఖ్యలో పర్యాటకులు వస్తున్నారు. ఎలాంటి ట్రాఫిక్​ జామ్​ కాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. సాగర్​ జలాశయం గేట్ల ద్వారా విడుదలవుతున్న కృష్ణమ్మ అందాలను చూస్తూ పర్యాటకులు తమ మొబైల్​ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటున్నారు. కుటుంబ సభ్యులతో కొందరు, స్నేహితులతో మరికొందరు ఇలా సాగర్​ అందాలను వీక్షించేందుకు తరలివస్తున్నారు. 

ఒకవైపు ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మరోవైపు సాగర్ జలాశయం వద్ద పర్యాటకులు కేరింతలు పెడుతున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ ప్రాంతమంతా పర్యాటకులతో సందడిగా మారింది. వాతావరణం కూడా చల్లగా ఉండడంతో పర్యాటకులు వివిధ ప్రాంతాల నుంచి సాగర్​కు చేరుకుంటున్నారు. జల సందడితో కూడిన సాగర్ డ్యాంను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని పలువురు పర్యాటకులు ఆనందం వ్యక్తం చేశారు. రేపు, ఎల్లుండి కూడా జలాశయం వద్ద రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనావేస్తున్నారు.  

ABOUT THE AUTHOR

...view details