మెదక్ జిల్లాలో భారీ వర్షం - జల దిగ్బంధంలోనే ఏడుపాయల దుర్గామాత ఆలయం - Huge Flood Water At Edupayala
Published : Sep 2, 2024, 10:27 AM IST
Huge Flood Water At Edupayala Durga Bhavani Temple : వరద ఉద్ధృతితో మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయం రెండు రోజులుగా జలదిగ్బంధంలోనే ఉంది. నక్క వాగు వరద మంజీరాలో చేరడంతో వనదుర్గా ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. రెండు రోజులుగా వర్షాలకు వనదుర్గ ప్రాజెక్టుకు భారీగా వరద వస్తోంది. ప్రాజెక్టు నుంచి 13 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉద్ధృతితో రాజగోపురంలో అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు.
ఆలయ అర్చకులు మాత్రమే గర్భగుడిలోకి వెళ్లి అమ్మవారి మూల విరాట్‌కు అభిషేకం, సహస్ర నామార్చన, కుంకుమార్చన ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరద ఉద్ధృతి తగ్గాక యధావిధిగా భక్తులకు దర్శనం కల్పిస్తామని ఆలయ అధికారులు తెలిపారు. మంజీరా నదిలోకి మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని నీటిపారుదల శాఖ అధికారులు సూచించారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు వనదుర్గ ప్రాజెక్టు వైపు వెళ్లకుండా పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.