తెలంగాణ

telangana

ETV Bharat / videos

భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు - సహస్ర కలశాలతో అభిషేకం - Badhrakali temple Abhishekam - BADHRAKALI TEMPLE ABHISHEKAM

🎬 Watch Now: Feature Video

By ETV Bharat Telangana Team

Published : Jul 6, 2024, 7:48 PM IST

Sahasra Kalasabhishekam in Bhadrakali Temple in Warangal : ఓరుగల్లు శ్రీ భద్రకాళి అమ్మవారి శాకాంబరీ ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. వరంగల్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఉత్సవాలను ప్రారంభించారు. ఆషాఢ మాసం తొలిరోజు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం నయనా నందకరంగా సాగింది. అర్చకుల వేద మంత్రాల నడుమ వేయి కలశాలలో నింపిన పుణ్య జలాలు, పంచామృతాలతో భద్రకాళి అమ్మవారికి అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ఈ సందర్భంగా భద్రకాళి అమ్మవారికి జై అంటూ భక్తులు చేసిన నామస్మరణలతో ఆలయ ప్రాంగణమంతా మారుమోగింది. శాకాంబరీ ఉత్సవాల సందర్భంగా అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిట లాడింది. భద్రకాళిని అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. వారాంతం అయినందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని అంచనా వేసి దానికి తగ్గ ఏర్పాట్లు చేశారు. ఈ నెల రోజులు ఆలయంలో ప్రత్యేక పూజలు, వేడుకలు నిర్వహిస్తామని ఆలయ పూజారులు తెలిపారు.  

ABOUT THE AUTHOR

...view details