మాస్టర్ చెఫ్ కావాలనుకుంటున్నారా ! - ఉపాధి అవకాశాలు ఎలా ఉన్నాయంటే ! - Culinary Institute of India
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 30, 2024, 6:10 PM IST
Culinary Institute of India: ఇటీవల హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులకు ఆదరణ పెరుగుతోంది. మంచి ప్యాకేజీతో ఉపాధి అవకాశాలు దక్కుతుండటంతో కాస్త భిన్నంగా ఆలోచించే యువత పాకశాస్త్రంలో డిగ్రీ చేయడంపై దృష్టి సారిస్తున్నారు. రకరకాల వంటకాలు నేర్చుకుని మాస్టర్ చెఫ్ కావాలని భావిస్తున్నారు. అలాంటి వారికి ఊతమిచ్చేలా కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ తిరుపతిలోని కలినరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ద్వారా అవకాశం కల్పిస్తోంది. 2018లో నాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ ఇన్‌స్టిట్యూట్ ప్రారంభించారు.
ఈ ఇన్‌స్టిట్యూట్‌లో చేరిన విద్యార్థులను ఐదేళ్లలో మాస్టర్ చెఫ్‌లుగా తీర్చిదిద్దుతామని అధ్యాపకులు చెబుతున్నారు. 3 సంవత్సరాల బీబీఏ కలినరీ ఆర్ట్స్‌తో పాటు 2 సంవత్సరాల ఎమ్‌బీఏ కలినరీ ఆర్ట్స్ ద్వారా ఉపాధి కల్పిస్తామంటున్నారు. కలినరీ ఇన్‌స్టిట్యూట్‌లో చేరేందుకు జూన్ 23న ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో ప్రవేశం, ఉపాధి అవకాశాలు ఎలా ఉంటాయి? అనే విషయాలపై కలినరీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధ్యాపకులతో ముఖాముఖి.