ETV Bharat / state

శ్రీవారిని దర్శించుకున్న సాయిదుర్గాతేజ్, అల్లు స్నేహారెడ్డి - సెల్ఫీల కోసం పోటీపడిన అభిమానులు - CELEBRITIES IN SRIVARI SEVA

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్, అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి

CELEBRITIES IN SRIVARI SEVA
ACTOR SAIDURGA TEJ AND ALLU ARJUN'S WIFE ALLU SNEHA REDDY IN SRIVARI SEVA (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 6, 2024, 11:59 AM IST

Supreme Hero Saidurga Tej Visits Tirumala : తిరుమల శ్రీవారిని మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ దర్శించుకున్నారు. వేకువ జామున శ్రీవారి సుప్రభాత సేవలో వారు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అతనికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న సాయి తేజ్ కి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. అభిమాన హీరోతో సెల్ఫీలు దిగేందుకు అందరూ తహతహలాడారు.

సాయిదుర్గా తేజ్ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. రచ్చ, బెంగాల్ టైగర్, గౌతమ్ నంద, సీటీమార్ లాంటి విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం వహించిన సంపత్ నందితో కలిసి 'గాంజా శంకర్' అనే సినిమాలో నటిస్తున్నారు. దీంతో పాటు రోహిత్ అనే యువ దర్శకుడితో ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో సైతం నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగు జరుపుకుంటున్నాయి. కొత్త డైరెక్టర్ అయిన రోహిత్ తో చేసే సినిమా కోసం సాయి తేజ్ ప్రత్యేకంగా సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీని కోసం కండలు తిరిగిన దేహంతో, గుబురు గడ్డంతో తనను తాను మలుచుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.

శ్రీవారి సేవలో అల్లు అర్జున్ సతీమణి: తిరుమల శ్రీవారిని అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి దర్శించుకున్నారు. వేకువ సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో ఆమె పాల్గొన్నారు. తితిదే అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న వారికి రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. స్నేహరెడ్డితో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు తాపత్రయుడ్డారు.

దుర్గుణరాశి 'నిష్టురి' కథ- నరక బాధలు అనుభవించిన కర్కశ- రెండో అధ్యాయం మీకోసం!

పరమ పవిత్ర కార్తిక మాసంలో పుణ్యస్నానాలు - ఇవి పాటిస్తే సకల పాపాలు విముక్తి!

కార్తీక మాసంలో ఈ పూజ చేస్తే చాలు - అశ్వమేధ యాగం చేసినంత ఫలం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.