ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

జగన్​కు ఆ విషయం కూడా తెలియదా? : హోంమంత్రి అనిత - Home Minister on Jagan Security - HOME MINISTER ON JAGAN SECURITY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 6, 2024, 7:53 PM IST

Home Minister Anitha on YS Jagan Security: ఒక గ్రామ జనాభా అంత సెక్యూరిటీ కావాలని వైఎస్ జగన్ అడుగుతున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు. మాజీ ముఖ్యమంత్రికి 980 మందితో భద్రత అవసరమా అని ప్రశ్నించారు. జగన్​కి ఇవ్వాల్సిన భద్రతను ఇస్తున్నామన్నారు. తాము ఎక్కడా జగన్ భద్రతను తగ్గించలేదని అనిత స్పష్టం చేశారు.

ప్రతిపక్ష హోదా కావాలి, భద్రత కావాలని హైకోర్టులో జగన్ పిటిషన్ వేయడం రాజకీయ లబ్ధి కోసమేనని ఆక్షేపించారు. ప్రతిపక్ష హోదా కావాలంటే పది శాతం అసెంబ్లీలో సీట్లు ఉండాలనే విషయం జగన్​కి తెలియదా అని నిలదీశారు. ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నమే జగన్ చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతులను హోంమంత్రి తీసుకున్నారు. జగన్ హయాంలో జరిగిన భూదోపిడీపై హోం మంత్రి అనితకు వినతులు వెల్లువెత్తాయి. జగన్ ఐదేళ్లలో ప్రజలను పీడించుకుతిన్నారని అనిత ఆరోపించారు. జగన్ బాధితులు పులివెందుల నుంచి ప్రజాదర్బార్​కు పెద్ద సంఖ్యలో వస్తున్నారన్నారు.

ABOUT THE AUTHOR

...view details