ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

మాదకద్రవ్యాల రహితంగా రాష్ట్రాన్ని మారుస్తాం : హోం మంత్రి అనిత - Home Minister In Anti Drug Day - HOME MINISTER IN ANTI DRUG DAY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 26, 2024, 4:32 PM IST

Home Minister Anitha Participated in Anti Drug Day at Visakhapatnam : విశాఖలో అంతర్జాతీయ మాదకద్రవ్యాల నివారణ, మానవ అక్రమ రవాణా నిర్మూలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం మాదకద్రవ్యాల నివారణ కోసం ర్యాలీని విశాఖ ఆర్కే బీచ్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అలాగే రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజులు భాగస్వాములైయ్యారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ, రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు కూటమి ప్రభుత్వం ధృడ నిశ్చయంతో ఉందని తెలిపారు. 

ఇతర రాష్ట్రల నుంచి గంజాయి అక్రమ రవాణా జరగకుండా చెక్​పోస్టుల వద్ద కట్టడి చేస్తామన్నారు. డ్రగ్స్, మానవ అక్రమ రవాణాలపై పూర్తి నిఘా పెంచామన్నారు. గంజాయిని కట్టడి చేసే నార్కోటిక్ సెల్ ను గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. పోలీసులు విధులలో చాలా కష్టపడుతున్నారని, విధి నిర్వహణలో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పని చేస్తున్నారని కొనియాడారు. ఇప్పుడు వారి సంక్షేమ కోసం ఆలోచించే ప్రభుత్వం వచ్చిందన్నారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా మార్చేందుకు అందరు చేతులు కలపాలని హోం మంత్రి అనిత తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details