ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శ్రీవారి సన్నిధిలో శ్రీలీల- కుటుంబసభ్యులతో హాజరైన అమ్మడు - Heroine sreeleela Visited Tirumala

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 19, 2024, 4:46 PM IST

Heroine Sreeleela Visited Tirumala: టాలీవుడ్​ యంగ్​ హీరోయిన్​ శ్రీలీల (Heroine Sreeleela) తిరుమల (Tirupathi) శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆమె స్వామివారి సేవలో కుటుంబంతో కలిసి పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఆలయ సిబ్బంది శ్రీలీలకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. శ్రీలీల గర్భాలయంలో స్వామివారిని దర్శించుకున్న అనంతరం స్వామివారి హుండీలో కానుకలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం తరువాత రంగనాయకుల మండపంలో వేదపండితులు శ్రీలీలకు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.

పెళ్లి సందడితో టాలీవుడ్​లోకి అరంగేట్రం చేసిన బ్యూటీ శ్రీలీల ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వరుస ఆఫర్లతో దూసుకెళ్తోంది. పెళ్లి సందడి సినిమా తరువాత వెంకన్న దర్శనానికి మళ్లీ ఇప్పుడే వచ్చానని ఆమె తెలిపారు. బాక్సాఫీస్ వద్ద డీసెంట్ టాక్ దక్కించుకున్న గుంటూరు కారం సినిమాలో శ్రీలీల నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కొన్ని ప్రాజెక్టులు పెండింగ్​లో ఉన్నాయని త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తామని శ్రీలీల పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details