విజయవాడలో తంగలాన్ టీమ్ సందడి - సెల్పీలకు అభిమానుల ఉత్సాహం - Thangalaan Promotion at Vijayawada - THANGALAAN PROMOTION AT VIJAYAWADA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 12, 2024, 12:37 PM IST
Hero Vikram visits Vijayawada Babai Hotel : విజయవాడలో సినీ నటుడు విక్రమ్ సందడి చేశారు. తంగలాన్ ప్రమోషన్లో భాగంగా హీరోయిన్ మాళవిక మోహనన్, నిర్మాత జ్ఞానవేల్ రాజాతో గాంధీనగర్‌లోని బాబాయ్ హోటల్లో టిఫిన్ తిన్నారు. విక్రమ్‌తో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. హీరో విక్రమ్ ‘తంగలాన్’తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఆయన టైటిల్ పాత్రలో నటించిన ఈ పాన్ ఇండియా సినిమాని పా. రంజిత్ తెరకెక్కించారు. నీలం ప్రొడక్షన్స్, స్టూడియో గ్రీన్, జియో స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్, పశుపతి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈనెల 15న విడుదల కానున్న నేపథ్యంలో ప్రచార పర్వాన్ని పరుగులు పెట్టిస్తోంది చిత్ర బృందం. ఈ క్రమంలోనే వారు విజయవాడకు వచ్చారు. స్వాతంత్య్రానికి పూర్వం కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో జరిగిన వాస్తవ సంఘటనల్ని ఆధారం చేసుకుని ఈ చిత్రం తెరకెక్కించారు. ఈ సినిమాకు సంగీతం జి.వి.ప్రకాశ్ కుమార్, ఛాయాగ్రహణం ఎ.కిశోర్ కుమార్ సమకూర్చారు.