ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE హీరో రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం - విజయవాడ నుంచి ప్రత్యక్షప్రసారం - RAM CHARAN CUTOUT LAUNCHING LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 29, 2024, 4:49 PM IST

Updated : Dec 29, 2024, 5:50 PM IST

Hero Ram Charan Cutout Launching Program LIVE : రామ్‌చరణ్‌ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’ శంకర్‌ దర్శకత్వంలో పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమా విడుదలను పురస్కరించుకొని విజయవాడలో భారీ కటౌట్ సిద్ధం చేశారు. విజయవాడ బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో 256 అడుగుల రామ్‌చరణ్‌ కటౌట్‌ ఏర్పాటు చేశారు. ఇంత భారీ స్థాయిలో కటౌట్‌ పెట్టడం ఇదే తొలిసారి అని ఇది తమకెంతో ప్రత్యేకమని అభిమానులు చెబుతున్నారు. రామ్‌చరణ్‌ యువశక్తి ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దాదాపు వారం రోజులు శ్రమించి దీనిని సిద్ధం చేశామని, చెన్నై నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ఈ నిర్మాణంలో భాగమైందని అభిమానులు తెలిపారు. ఈ కార్యక్రమానికి గేమ్ ఛేంజర్ చిత్ర బృందం, తెలుగు రాష్ట్రాల్లోని మెగా అభిమానుల నాయకులు హాజరవుతారని చెప్పారు. ఆయన విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ కటౌట్ ను ఏర్పాటు చేశామన్నారు. గేమ్ ఛేంజర్ చిత్రం ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇవాళ సాయంత్రం ఆ మైదానంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రస్తుతం హీరో రామ్ చరణ్ 256 అడుగులు భారీ కటౌట్ ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.  ప్రత్యక్షప్రసారం మీకోసం.
Last Updated : Dec 29, 2024, 5:50 PM IST

ABOUT THE AUTHOR

...view details