తెలంగాణ

telangana

ETV Bharat / videos

ఎన్నేళ్లో వేచిన ఉదయం - నిండుకుండలా నారింజ ప్రాజెక్టు - గేట్ల మీదుగా పొంగుతోన్న వరద నీరు - Heavy Rain In Sangareddy - HEAVY RAIN IN SANGAREDDY

By ETV Bharat Telangana Team

Published : Aug 19, 2024, 3:33 PM IST

Heavy Rain Water Inflow For narinja Project Sangareddy : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తూరు (బి) నారింజ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. కోహీర్, జహీరాబాద్ మండలాల్లో గత 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగడంతో నారింజ ప్రాజెక్టుకు భారీగా వరద వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు నిండుకుండలా మారడంతో గేట్ల మీద నుంచి వరద నీరు పారుతుంది. ప్రాజెక్టు వద్ద వరద ఉద్ధృతి పెరగడంతో అధికారులు దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల వారిని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

వర్షాకాలంలో ప్రాజెక్టు నిండి గేట్ల మీదుగా వరద నీరు పొంగటం ఇదే మొదటిసారి. దీంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో రోజులుగా వర్షం కోసం ఎదురు చూస్తున్న సంగారెడ్డి జిల్లా రైతులకు ఈ వర్షం ఊరటనిచ్చింది. కాగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ABOUT THE AUTHOR

...view details