ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రంలో డయేరియా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు- ప్రతి ఒక్కరికీ అవగాహన తప్పనిసరి - Diarrhea Cases in AP - DIARRHEA CASES IN AP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 16, 2024, 7:02 PM IST

Health Special Secretary Krishna Babu Interview On Diarrhea Cases : రాష్ట్రంలో డయేరియా కేసులు అరికట్టేందుకు వైద్యాధికారులు చర్యలు చేపడుతున్నారు. కేసులు నమోదైన చోట ప్రత్యేక వైద్యశిబిరాలు ఏర్పాటుచేసి చికిత్సను అందిస్తున్నారు. 'స్టాప్ డయేరియా' కార్యక్రమంలో భాగంగా ప్రజలందరీకి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఏమైనా డయేరియా లక్షణాలు ఉంటే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకోవాలని సూచిస్తున్నారు. డయేరియాపై ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి పి.కృష్ణబాబు మాట్లాడుతూ, వాతావరణంలో మార్పుల వల్ల డయేరియా కేసులు అధికంగా పెరుగుతున్నాయని తెలిపారు. ఇప్పటి వరకు వచ్చిన డయేరియా కేసుల్లో 90 శాతం నీటి కలుషితం కారణంగానే వచ్చాయన్నారు. చాలా చోట్ల మంటి నీటి పైపు లైన్లు పగిలి డ్రైనేజీ నీరు కలుస్తున్నాయని వెల్లడించారు. అందుకోసమే నీరు ఎక్కడ కలుషితమవుతుందో గుర్తించడానికి వారానికి దాదాపుగా 10వేల నీటి శ్యాంపిల్స్​ను పరీక్షిస్తున్నామని వెల్లడించారు. 

గత రెండు నెలలుగా 289 శ్యాంపిల్స్​లో నీరు కలుషితం అయినట్లు తెలిందన్నారు. ఇలాంటి ప్రాంతాల్లో పంచాయితీరాజ్ అధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తున్నామని తెలిపారు. అలాగే డయేరియాపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఎదైనా గ్రామంలో ఒకటీ, రెండు డయేరియా కేసులు నమోదైతే ఆ గ్రామం మెుత్తాన్ని సర్వే చేపిస్తున్నామని వెల్లడించారు. అదేవిధంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడమేగాక, ఆహరం తినే సమయంలో చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. నీరు తాగే సమయంలో కాచి వడబోసి తాగాలని కృష్ణబాబు సూచించారు. 

ABOUT THE AUTHOR

...view details