LIVE : సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మీట్ ది ప్రెస్ - Harish Rao Meet the press - HARISH RAO MEET THE PRESS
Published : May 4, 2024, 12:06 PM IST
|Updated : May 4, 2024, 1:04 PM IST
Harish Rao Meet the press Programme in Hyderabad : లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాలు సాగిస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు 'మీట్ ది ప్రెస్'లో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ వచ్చాక కల్యాణ లక్ష్మీ పేరిట తులం బంగారం ఏమోగానీ, లక్ష రూపాయలు కూడా ఇవ్వడంలేదని హరీశ్‌రావు అన్నారు. ప్రజలు రూ.4 వేల పెన్షన్ వస్తుందని ఆశపడి కాంగ్రెస్‌ను నమ్మితే రెండు వేల రూపాయలు కూడా రావడం లేదని ఆరోపించారు.ప్రశ్నించిన నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీలకు సార్వత్రిక ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలు ఏమయ్యాయన్న ఆయన, 120 రోజులు గడిచినా హామీలు నెరవేరలేదని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి వంద రోజులు గడిచిన రైతులకు రుణమాఫీ చేయలేదని అన్నారు. మహిళలకు హామీ ఇచ్చిన రూ.10 వేలు చెల్లించాకే కాంగ్రెస్ ఓట్లు అడగాలని తెలిపారు. కాంగ్రెస్ మోసాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని హరీశ్‌రావు అన్నారు.
Last Updated : May 4, 2024, 1:04 PM IST