వినూత్నంగా 'హర్ ఘర్ తిరంగా' - 300 మంది స్కేటింగ్ చేస్తూ కార్యక్రమం - 300 skaters in Har Ghar Tiranga - 300 SKATERS IN HAR GHAR TIRANGA
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 14, 2024, 12:34 PM IST
Har Ghar Tiranga Programme held with 300 skaters in visakha : విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆధ్వర్యంలో జరిగిన 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమాన్ని వినూత్నంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకాన్ని చేతపట్టిన చిన్నారులు స్కేటింగ్ చేశారు. సుమారు 300 మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్కేటింగ్ రింగ్‌లో "హర్ ఘర్ తిరంగా" పాటకు లయబద్దంగా స్కేటింగ్ చేశారు. విశాఖ ఉక్కు కర్మాగారం క్రీడా విభాగం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జాతీయ పతాకాన్ని రెపరెపలాడించారు.
ఈ ఆగస్టు 15న నిర్వహించే 78వ స్వాతంత్య్ర దినోత్సవానికి ముందస్తు కార్యక్రమాలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు మువ్వన్నెల జెండాలతో ముస్తాబయ్యాయి. పాఠశాలలు, కాళాశాలలో విద్యార్థులకు ఆటలు, సాంస్కృతిక పోటీలు నిర్వహించారు. స్వాతంత్య్ర సమర యోధులను గుర్తు చేసుకుని ప్రతీ ఏటా జరుపుకునే ఈ వేడుకకు సర్వం సిద్దమైంది. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంతో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ వద్ద జరిగిన కార్యక్రమం కన్నుల విందుగా నిర్వహించారు.