ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE: షిర్డీ సహా రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు- ప్రత్యక్ష ప్రసారం - Guru Purnima Celebrations - GURU PURNIMA CELEBRATIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 21, 2024, 6:18 AM IST

Updated : Jul 21, 2024, 10:04 AM IST

Guru Purnima 2024 Celebrations: రాష్ట్ర వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. సాయిబాబా దేవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆదివారం తెల్లవారుజామునుంచే ఆలయాలకు భక్తులు క్యూ కట్టారు. గురుపౌర్ణమి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని సాయినాథుడి ఆలయాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. వేకువజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని సాయిబాబాను దర్శించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని  విజయవాడ, విశాఖ, తిరుపతి, ఒంగోలు, కర్నూలు బాలాజీనగర్‌, నెల్లూరు, విజయనగరం, అనంతపురంలోని ఆలయాలకు భక్తులు భారీగా చేరుకొని సాయినాథుడిని దర్శించుకుంటున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, కరీంనగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, వరంగల్‌ ఇలా వివిధ ప్రాంతాల్లోని ఆలయాల్లో  వైభవోపేతంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. భక్తులు కుటుంబ సమేతంగా ఆలయాలకు వెళ్లి బాబాను దర్శించుకుంటున్నారు. దేశ వ్యాప్తంగానూ వైభవంగా గురుపౌర్ణమి వేడుకలు జరుగుతున్నాయి. మహారాష్ట్రలోని షిరిడీ ఆలయంలో గురుపౌర్ణమి వేడుకలు పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి షిరిడీ చేరుకున్న భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఏపీలో గురుపౌర్ణమి వేడుకలు ప్రత్యక్ష ప్రసారం. 
Last Updated : Jul 21, 2024, 10:04 AM IST

ABOUT THE AUTHOR

...view details