ప్రమాణ స్వీకారాన్ని వీక్షించిన గుంటూరు ప్రజలు - భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్న మహిళలు - Guntur People Happy With CBN Oath - GUNTUR PEOPLE HAPPY WITH CBN OATH
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 12, 2024, 3:38 PM IST
Guntur People Happy With Taking Chandrababu Oath: కూటమి ప్రభుత్వం కొలువుదీరడంపై గుంటూరు వాసులు, మహిళలు తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించిన మహిళలు రావణాసుర పాలన అంతమై రామరాజ్యం వచ్చిందంటూ సంబరాలు చేసుకున్నారు. గత ఐదేళ్ల వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారని, చంద్రబాబుని సైతం జైలులో పెట్టి వేధించారని మహిళలు అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయని పేర్కొన్నారు. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన చంద్రబాబు ప్రజల కోసం, రాష్ట్రం కోసం అనేక అవమానాలు ఎదుర్కొన్నారని మహిళలు భావోద్వేగానికి లోనయ్యారు. చంద్రబాబు పాలనలో యువతకు విద్య, ఉపాధి అవకాశాలతోపాటు రాష్ట్రానికి మంచి చేసేందుకు కృషి చేస్తారని మహిళలు తెలిపారు. తమ భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు చంద్రబాబు నాయకత్వంలో ఉత్తమంగా తీర్చిదిద్దబడుతుందని గుంటూరు మహిళలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వీరాంజనేయులు తెలియజేస్తారు.