ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

LIVE : విజయవాడలో గణతంత్ర దినోత్సవ వేడుకలు - ప్రత్యక్షప్రసారం - REPUBLIC DAY CELEBRATIONS LIVE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 26, 2025, 9:04 AM IST

Updated : Jan 26, 2025, 11:05 AM IST

Republic Day Celebrations Live : రాష్ట్రవ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. విద్యాసంస్థలు, అన్ని పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేట్ ఆఫీసుల్లో గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పల్లెలన్నీ త్రివర్ణ పతాకాల రెపరెపలతో మెరిసిపోయాయి. జిల్లాల్లో మంత్రులు, అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నారు.  వివిధ శాఖల శకటాల ప్రదర్శన, సాంస్కృతిక నృత్యాలతో విద్యార్థులు అలరిస్తున్నారు. మరోవైపు హైకోర్టు ప్రాంగణంలోనూ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన నేతలు అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందని వ్యాఖ్యానించారు. లౌకికత్వం, సమానత్వమే రాజ్యంగం ముఖ్య ఉద్దేశమని నేతలు తెలిపారు. ప్రజలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన రిపబ్లిక్ డే వేడుకల్లో గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ఈ వేడుకలకు సీఎం చంద్రబాబు సహా మంత్రులు, తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల దృష్ట్యా పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని సూచించారు.
Last Updated : Jan 26, 2025, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details