వైసీపీ సేవలో సచివాలయ ఉద్యోగ సంఘం అధ్యక్షుడు - కేసు నమోదు - CASE ON VENKATRAMI REDDY - CASE ON VENKATRAMI REDDY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 3, 2024, 3:00 PM IST
Government Employees Involved Election Campaign in YSR District : ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ప్రచారం చేసిన వారిపై కడప ఒకటో పట్టణ పోలీసు స్టేషన్లో కేసులు నమోదు చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామి రెడ్డి, వైఎస్సార్ ఆర్టీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చల్లా చంద్రయ్య, ఉపాధ్యక్షుడు బాబా ఫకృద్ధీన్, బద్వేలు ఆర్టీసీ ఉద్యోగి సుందరయ్యపై ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో కేసును నమోదు చేశారు. కడప, బద్వేల్, మైదుకూరు, ప్రొద్దుటూరు డిపోలకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని ప్రచారం చేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.
ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి ఏకంగా సన్మాన కార్యక్రమాలను నిర్వహించారు. వీరితో పాటు డిపో అధికారులు కూడా ప్రచారంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కొందరు ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్థానిక పోలీసు స్టేషన్ కేసును నమోదు చేశారు. ఈ ముగ్గురు అధికారులతో పాటు మరికొంత మంది ఆర్టీసీ ఉద్యోగులపై కూడా కేసు నమోదు చేసినట్లు సమాచారం.