ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల వేళ జగన్ కొత్త డ్రామా - గులకరాయిదాడి కుట్రలో భాగమే: బుచ్చయ్య చౌదరి - Stone Attack On CM Jagan - STONE ATTACK ON CM JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 15, 2024, 1:03 PM IST

Gorantla Butchaiah Chaudhary on CM Jagan attacked Incident: ఎన్నికల వేళ మరో కొత్త డ్రామాకు జగన్‌ తెరతీశారని రాజమహేంద్రవరం రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో విద్యుత్‌ సరఫరా నిలిపేయడం గులకరాయితో దాడి చేయడం అంతా కుట్రలో భాగమేనని విమర్శించారు. సానుభూతి కోసమే ప్రజలను తప్పుదారి పట్టించేందుకు జగన్‌ నాటకాలాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన సీఎంకే భద్రత లేదంటే అది జగన్ చేతకానితనమన్నారు. ఇది ముమ్మాటికీ తాడేపల్లి ప్యాలెస్​లోని ఐ ప్యాక్ ఆధ్వర్వంలో పథకం ప్రకారం జరిగిన దాడిగా అభివర్ణించారు. 

గత ఎన్నికల సమయంలో బాబాయ్ చంపి, చంద్రబాబు మీద దుష్ప్రచారం చేసి లబ్ధి పొందారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వివేకా రక్తపు పునాదుల మీద జగన్ ప్రభుత్వం ఏర్పడిందని సొంత చెల్లెలే చెబుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోసం వైసీపీ ఆడుతున్న నాటకాలను ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఇది ముందుగా అనుకున్న పథకంలో భాగమేమో అని బుచ్చయ్య చౌదరి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details