తెలంగాణ

telangana

ETV Bharat / videos

గోల్కొండ కోటలో సౌండ్ అండ్‌ లైట్ షో - గోల్కొండలో సౌండ్‌ అండ్‌ లైట్‌ షో

By ETV Bharat Telangana Team

Published : Jan 24, 2024, 12:50 PM IST

Golconda Sound And Light Show : చారిత్రక గోల్కొండ కోట అత్యాధునిక హంగులతో కనువిందు చేయబోతుంది. పర్యాటకులను పెంచడమే లక్ష్యంగా రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా, ఈ కోట చరిత్రను తెలిపేలా సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఈరోజు (జనవరి 24) ప్రారంభించనున్నారు. మెగాస్టార్​ చిరంజీవి, ఎంపీ విజయేంద్రప్రసాద్‌ ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారు.

Sound And Light Show At Golconda Fort : 11వ శతాబ్దం నాటి గోల్కొండలో ప్రస్తుత సౌండ్‌ అండ్‌ లైట్‌ షోను 1993లో ఏర్పాటు చేశారు. 30 సంవత్సరాల క్రితం నాటి పరిజ్ఞానం స్థానంలో సరికొత్తది ప్రవేశపెడుతున్నారు. ఈ షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్‌ భాషల్లో 30 నిమిషాల 20 సెకన్ల సమయం ఉంటుంది. అంతర్జాతీయ హంగులతో గోల్కొండ చరిత్రను చూపించేలా 3డీ మ్యాపింగ్‌ ప్రొజెక్షన్‌, హై-రెజల్యూషన్‌ ప్రొజెక్టర్లు, లేజర్‌ లైట్లు, మూవింగ్‌ హెడ్స్‌ వంటి అధునాతన సాంకేతికతను ఇందులో ఉపయోగించారు.

ABOUT THE AUTHOR

...view details